ప్రజా సంక్షేమానికి పెద్ద పీట

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి ఏటా రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ముచ్చర్ల కృష్ణారెడ్డి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.

గతంలో దేశంలోనే ఏ సర్కార్ చేయని విధంగా రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రతి ఏటా రెండు పంటలకు రూ. 8 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు వంటి వాటిని సరఫరా చేస్తూ సాగు పెట్టుబడులను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. వ్యవసాయం దండగ అన్న వాళ్ళతో వ్యవసాయం పండగ అనే విధంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ఇలాంటి అనేక కొత్త పథకాలకు సీఎం కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్నారని వివరించారు.

మంత్రి లక్ష్మారెడ్డి గ్రామానికి చెందిన గొల్ల కురుమలు ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో చేరారు. ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. రాంరెడ్డిపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. ఊర్కొండ, ఊర్కొండపేటలో నూతన గ్రామపంచాయతి భవనాలకు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.