ప్రజల గొంతు వినిపించకుండా బీజేపీ అడ్డుకుంటోంది

ప్రజల గొంతును వినిపించకుండా బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు కాంగ్రెస్ వైస్  ప్రసిడెంట్ రాహుల్ గాంధీ. అధికార బలంతో నిజం గొంతు నొక్కుతోందన్నారు. ఒకప్పుడు నిజాయితే అధికారాన్ని శాసించేదని, ఇప్పుడు అధికారమే నిజాన్ని శాసిస్తోందని వ్యాఖ్యానించారు. నేషనల్  హెరాల్డ్‌  పత్రిక ప్రచురించిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ స్మారక సంచికను ఉప రాష్ట్రపతి అన్సారీతో కలిసి బెంగళూరులో ఆయన ఆవిష్కరించారు. మౌనంగా ఉండొద్దని, నిజాన్ని నిర్భయంగా చెప్పాలని, భయపడవద్దని రాహుల్ చెప్పారు.