ప్రజలంతా మొక్కలు నాటాలి

ప్రజలంతా హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటాలని వరంగల్‌ అర్బన్ కలెక్టర్‌ ఆమ్రపాలి కోరారు. హసన్ పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్టలో సీడ్‌ బాల్స్‌ వెదజల్లే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రభుత్వం హరితహారాన్ని ప్రారంభించిందన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు. సీడ్‌ బాల్స్‌ వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు.