పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మధ్యప్రదేశ్‌  వెళ్లిన  రాహుల్   గాంధీని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. పర్యటనకు అనుమతి లేదంటూ నిముచ్  దగ్గర ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో తరలించారు. ప్రధాని మోడీ రైతులను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు  రాహుల్‌. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. ఇప్పటి వరకూ ఒక్క రుపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న అన్నదాతలను బుల్లెట్లతో కాల్చి చంపడం దారుణమన్నారు.