అభ్యర్థి ఎవరో చెప్పకుండా చర్చలా!?

రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై బీజేపీ నియమించిన మంత్రుల బృందం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసింది. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ఏచూరితో చర్చలు జరిపారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరి పేరును తమతో మంత్రులు ప్రస్తావించలేదని, అందుకే చర్చలు ఎలాంటి క్లారిటీ లేకుండా ముగిశాయన్నారు సీతారాం ఏచూరి. పార్టీలో అంతర్గతంగా చర్చించి మరో నాలుగైదు రోజుల్లో వస్తామని మంత్రులు అన్నారని, అయితే ఆలోగా నామినేషన్ల గడువు కూడా దగ్గర పడుతుందన్నారు. చివరి నిమిషం వరకు ఇలాగే సాగదీయాలని బీజేపీ భావిస్తున్నట్లుందన్నారు ఏచూరి.