పేద ముస్లింలకు కొత్త బట్టల పంపిణీ

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు ఉచితంగా కొత్త దుస్తులను అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బట్టల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ డివిజన్ లో నిరుపేద ముస్లింలకు బట్టల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. అందరికీ కొత్త దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అటు సికింద్రాబాద్ బోయిన్ పల్లిమజీద్ లో ఎమ్మెల్యే సాయన్న ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు.

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ముస్లింలను బట్టలను అందజేశారు. హాలియాలో మంత్రి జగదీశ్ రెడ్డి ముస్లింలకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. మిర్యాలగూడలో బట్టల పంపిణీ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అందరికీ కొత్త దుస్తులను అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత నిరుపేద ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. కొత్త దుస్తులను అందరికీ అందజేశారు. అంతకుముందు నాలుగు మండలాల్లో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను ఆమె  అందచేశారు.

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ జామా మసీదు లో బట్టల పంపిణీ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ దుస్తుల పంపిణీ జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లింలకు బట్టలను పంపిణీ చేశారు. పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ … ఈ దుస్తులను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో సుమారు 200 మంది నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున బట్టలను పంపిణీ చేశారు. సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఈ కొత్త దుస్తుల పంపిణీ జరిగింది.

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ జరిగింది. ముస్లింలకు ఆయన కొత్త బట్టలను అందజేశారు. ఇటు నిజామాబాద్  జిల్లా ఆర్మూర్ మాక్లూర్, నందిపేట్  మండలాల్లో ఎమ్మెల్యే జీవన్  రెడ్డి బట్టలను ముస్లింలకు పంపిణీ చేశారు.