పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం ఆకాంక్ష

పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని మంత్రి కేటీఆర్‌  అన్నారు. వారి కోసం దేశంలోనే మరెక్కడా లేని విధంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ప్రజల దగ్గరి నుంచి  పైసా తీసుకోకుండా ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. మొత్తం 28 రాష్ట్రాల్లో పేదల గృహ నిర్మాణానికి చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ నిధులు ఒక్క తెలంగాణలో ఖర్చు పెడుతున్నామని చెప్పారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం అహ్మద్‌ గూడలో డబుల్‌  బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు సుధీర్‌  రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.