పెరూలో అమెరికా దౌత్యవేత్తగా కృష్ణ

అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ట్రంప్ సర్కార్‌  పెరూకు అమెరికా దౌత్యవేత్తగా భారత సంతతి వ్యక్తి అయిన కృష్ణను నియమించారు. 1986 నుంచి అమెరికా దౌత్యవేత్తగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం స్పెయిన్‌లోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా ఆయన పేరు తెచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కృష్ణ ఎం.ఎస్ పట్టా పొందారు. స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడగలగడంతో పాటు హిందూ, తెలుగు భాషలను కూడా మాట్లాడగలరు.