పీవీకి భారత రత్న ఇవ్వాలి

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకి భార‌త రత్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు రాజ్యస‌భ సభ్యుడు కెప్టెన్‌ ల‌క్ష్మీకాంత‌రావు. ప్రధానిగా ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివని అన్నారు. రేపు పీవీ 96వ జయంతిని పురస్కరించుకుని వరంగల్‌ లో ఏకశిల ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించ‌నున్నట్లు తెలిపారు. పివి నరసింహరావు వ‌రంగ‌ల్ గడ్డపై పుట్టినందుకు మ‌నమంతా గ‌ర్వించాల‌న్నారు.