పీటీ ఉష అథ్లెటిక్స్ స్కూల్ ప్రారంభించిన ప్రధాని

ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషకు చెందిన ఉష అథ్లెటిక్స్ స్కూల్‌ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కేరళలోని స్కూల్ కు ఆయన  ప్రారంభించారు. పీటీ ఉష దేశానికే గర్వకారణమన్న ప్రధాని.. ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉష లాగానే అందరూ తమ కూతుళ్లను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.