పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం దగ్గర పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. మృతులు రామయ్య, పర్వతాలుగా గుర్తించారు. కన్నెపల్లి మండలం జనకాపూర్‌లో భారీ వర్షానికి చర్చి కూలింది. దుబ్బగూడెంలో ఈదురుగాలులకు 11 కెవి విద్యుత్‌ వైరు తెగింది.  ఆరు బర్లు చనిపోయాయి.