పాలీహౌస్‌లను సందర్శించిన మంత్రి పోచారం

అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి  ఇల్లినాయిస్ రాష్ట్రంలోని    సౌత్ బరింగటన్ సిటీలోని గోయిబర్ట్స్ ఫామ్ లో నిర్మించిన పాలీహౌస్ లను సందర్శించారు. అత్యంత అధునాతన పద్దతులతో నిర్మించిన ఈ పాలీహౌజ్ లలో ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే ఏర్పాట్లు ఉన్నాయి. సీజన్ లతో సంబంధం లేకుండా అన్ని రకాల కూరగాయలను, పూలను ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యధిక దిగుబడులను పొందుతున్నారు. సాగు విధానాలను, మార్కెటింగ్ సౌకర్యాలను ఫాం మేనేజర్ మంత్రికి వివరించారు. అదే విధంగా పండించిన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి నేరుగా మార్కెట్ కు తరలించడాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.