పార్లమెంటుకు జీఎస్టీ వెలుగులు

పార్లమెంట్‌ భవనం కలర్ పుల్‌ గా మారిపోయింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలులోకి వస్తున్న సందర్భంగా సెంట్రల్‌ హాల్‌ లో నిర్వహించే వేడుక కోసం పార్లమెంట్‌ భవనాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భవనం మొత్తం లైటింగ్‌ తో డెకరేట్‌ చేశారు. దీంతో పార్లమెంట్‌ భవనం విద్యుత్‌ కాంతులతో ధగధగ మెరిసిపోతోంది.