పాన్ కార్డుకు ఆధార్ లింకుపై స్టే

పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానంపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ఐటి రిటర్నుల దాఖలుకు ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. ఆధార్ కార్డ్ డాటా లీక్ కాకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీం తేల్చిచెప్పింది.