పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరి.. చిరకాల ప్రత్యర్థి భారత్‌ తో మ్యాచ్‌కు రెడీ అవుతున్న పాకిస్థాన్‌ జట్టులో మాజీ క్రికెటర్‌ అమీర్‌ సోహైల్‌ ప్రకంపనలు రేపాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ జట్టు మ్యాచ్‌ల ఫిక్సింగ్‌ కు పాల్పడి ఉండొచ్చని ఆరోపించాడు. ఫిక్సర్ల సాయంతో ప్రత్యర్ధి జట్లకు భారీగా నగదు ముట్టజెప్పడంతోనే పాక్ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. మైదానంలో ఆటతీరుతో కాకుండా జట్టుతో పాటు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో పాక్ బడా వ్యాపారవేత్తల హస్తం ఉందని పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు.