పాక్‌కు చుక్కలు చూపించిన భారత్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు భారత్‌కు మరోసారి చుక్కలు చూపెట్టింది. తమ ఆధిపత్యాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ దాయాదిని దంచింది. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 6-1 తేడాతో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో ఐదు, ఆరు స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో కెనడాతో  హాకీ ఇండియా తలపడుతుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ తరఫున రమణ్‌దీప్‌సింగ్(8ని, 28ని), మన్‌దీప్‌సింగ్(27ని, 59ని) డబుల్ గోల్స్‌తో అలరించగా, హర్మన్‌ప్రీత్‌సింగ్(36ని)మరో గోల్ చేశాడు. మరోవైపు పాక్ జట్టులో అహ్మద్ ఐజాజ్(41ని) ఏకైక గోల్ కొట్టాడు. ఈ ఓటమితో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌నకు అర్హత సాధించే అవకాశాన్ని పాక్ క్లిష్టం చేసుకుంది. నెదర్లాండ్స్, అర్జెంటీనా ఫైనల్లో తలపడనున్నాయి.