పాకిస్థాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న15 మంది అరెస్ట్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న 15 మందిని అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. గత ఆదివారం రాత్రి పాక్ విజయం సాధించిన వెంటనే మధ్యప్రదేశ్ లోని  బుర్హాన్ పూర్ లో కొందరు యువకులు నానా హంగామా సృష్టించారు. పాక్ గెలవగానే…పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. అంతేకాదు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై సెక్షన్‌ 120బీ, 124ఏ కింద కేసు పెట్టారు.