పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలను వర్షం పలకరించింది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అటు జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, పెగడపల్లి, బుగారం మండలాల్లో ఉరుములతో కూడిన వాన.. కోరుట్లలో చిరుజల్లులు కురిశాయి. అలాగే పెద్దపల్లి మండలంతోపాటు ఆ జిల్లాలోని జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో ఈదుగాలులతో కూడిన మోస్తరు వాన పడింది. నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి, భీంగల్‌, మోర్తాడ్‌ మండలాలతోపాటు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడిమ్యాల, మెట్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, కోనారావుపేట మండలాల్లోనూ వర్షం కురిసింది. అటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌, గాంధారీ, బాన్సువాడ, నస్రుల్లాబాద్‌ మండలాల్లో వాన పడింది. సిద్దిపేట పట్టణం, ఆ జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలంలోనూ వర్షాలు కురిశాయి.