పిడుగు పాటుకు పని చేయని రైల్వే సిగ్నల్స్‌

పెద్దపల్లి జిల్లా పొత్కపల్లిలో పిడుగులు పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు పొత్కపల్లిలో రైల్వే సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో కాజీపేట, బలార్ష మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.