పదహారణాల పల్లెటూరి అమ్మాయి

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ ఏడాది సమంతకు బాగా కలిసివస్తున్నది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నది. మరోవైపు అక్టోబర్ నెలలో ప్రియుడు నాగచైతన్యను పెళ్లాడనున్నది. ప్రస్తుతం  దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న రంగస్థలం చిత్రీకరణతో బిజీగా ఉన్నది. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో రామ్‌చరణ్, సమంతతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. సరస్సు ఒడ్డుపై కూర్చొని సూర్యస్తమయాన్ని చూస్తున్న ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో వాలుజడ, లంగావోణీతో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నది. రంగస్థలం సినిమాలో ఆమె లుక్ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామీణ యువతిగా ఆమె పాత్రను దర్శకుడు సుకుమార్ వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.