పటాకుల కేంద్రంలో పేలుడు, 20 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఓ పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ లోపల సుమారు 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కార్మికుల నిర్లక్ష్యం వల్లే  పేలుడు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. కాల్చిన బీడీ ముక్క వల్లే పేలుడు సంభవించినట్లు చెప్పారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2015లోనూ ఇదే ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. అప్పుడు 12 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి.