నోయిడాలో సామ్‌సంగ్ కొత్త యూనిట్‌

కొరియాకు చెందిన వినియోగదారుల వస్తువుల తయారీ సంస్థ సామ్‌సంగ్ స్పీడ్ పెంచింది. నోయిడాలో ఉన్న స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల యూనిట్ల సామర్థాన్ని రెట్టింపు చేయడానికి రూ.4,915 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రారంభించారు. సామ్‌సంగ్  వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో 15 వేల మందికి నూతనంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.