నేటి నుంచి మహారాష్ట్ర రైతుల సమ్మె 

ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర రైతులు ఇవాళ్టి(గురువారం) నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోవడం తదితర సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటరుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొన్నాళ్లుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కిసాన్‌ క్రాంతి మోర్చా ప్రతినిధులతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమై రైతుల సమస్యలపై చర్చించారు. ఇవి అసంపూర్తిగా ముగియడంతో వారు సమ్మెకు పిలుపునిచ్చారు. రైతుల సమ్మెకు కూలీలు, మార్కెట్‌ యూనియన్లు మద్దతునిచ్చారు. సమ్మె కారణంగా కూరగాయలు, పాల విక్రయాలను రైతులు నిలిపివేయనున్నారు.