నెలాఖరులో ట్రంప్ తో మోడీ భేటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో శ్వేతసౌధంలో ఇరు దేశాధినేతలు  భేటీ అయ్యే అవకాశం ఉంది. ‘భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నామని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌ ప్రతినిధి హేథర్‌ న్యూర్ట్‌ తెలిపారు. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ వైట్‌ హౌజ్‌ కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. గత యూఎస్‌ ప్రభుత్వ సమయంలో ప్రధాని మోడీ దాదాపు ఎనిమిది సార్లు అధ్యక్షుడు ఒబామాతో సమావేశమయ్యారు.