నెక్లెస్ రోడ్డులో ధూంధాం, ఫుడ్ ఫెస్టివల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజా వద్ద టూరిజం కార్పొరేషన్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ధూంధాం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు ఫెస్టివల్ నుం ప్రారంభించారు. వారితో పాటు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను సందర్శించారు. తెలంగాణ వంటకాలను రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూం ధాం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాకారుల ఆట-పాట సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.