నిరుపేద రైతులకు న్యాయం జరుగుతోంది

జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ కవిత తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నిరుపేద రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. సాదా బైనామా భూమి పట్టాలను పంపిణీ చేశారు.