నిజ‌మైన మిత్రుడి కోసం వేచిచూస్తున్నా!

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ ఉద‌యం వాషింగ్ట‌న్ డీసీ చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు ఘ‌న స్వాగతం ల‌భించ‌డంతో అమెరికా ప్ర‌ధాని డొనాల్డ్ ట్రంప్ కు ఆయ‌న కృతజ్ఞత‌లు తెలియ‌జేశారు. ట్రంప్ తో భేటీ కోసం ఎంతో ఆస‌క్తి గా ఎదురుచూస్తున్నాని ట్వీట్ చేశారు మోడీ. ఇక‌.. ట్రంప్.. ప్ర‌ధాని మోడీని నిజ‌మైన మిత్రుడిగా అభివ‌ర్ణించారు. సోమ‌వారం మోడీతో చాలా ముఖ్య‌మైన విష‌యాల మీద మాట్లాడ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ట్రంప్ తో వ‌ర్కింగ్ డిన్న‌ర్ ఇంత‌వ‌ర‌కు ఏ విదేశీ నాయ‌కుడు చేయ‌లేదు. దీంతో.. ట్రంప్ తో వ‌ర్కింగ్ డిన్న‌ర్ చేసే మొట్ట మొద‌టి నాయ‌కుడిగా మోడీ రికార్డుకెక్క‌నున్నారు. ఇక‌.. సోమ‌వారం సైబ‌ర్ సెక్యూరిటీ, కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ మీద మోడీ, ట్రంప్ భేటీ ఉంటుంద‌ని యూఎస్ కు చెందిన ఇండియా అంబాసిడ‌ర్ న‌వ్ తేజ్ శ‌ర్న తెలిపారు.