నాపెళ్లి కాకపోవడానికి అతడే కారణం!

నాలుగుపదుల వయసు దాటినా  తానికంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం  బాలీవుడ్ హీరో అజయ్‌దేవగణే అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది టబు. ప్రస్తుతం ఆమె అజయ్‌దేవ్‌గణ్‌తో కలసి గోల్‌మాల్ ఎగైన్ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అజయ్‌దేవ్‌గణ్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించింది. అజయ్‌తో నాకు 25 ఏళ్లుగా పరిచయముంది. మా కజిన్ సమీర్, అజయ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కాలేజీ రోజుల్లో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను కనిపెడుతుండేవారు. నాతో ఎవరైనా అబ్బాయిలు సన్నిహితంగా వున్నట్లు అనిపిస్తే వారిని కొడతామని బెదిరించేవారు. దాంతో నా దగ్గరకు రావడానికి అబ్బాయిలు భయపడేవారు. అందుకేనేమో నాకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అందుకు కారణం అజయ్‌దేవగణే అని తన కాలేజీ రోజుల్ని సరదాగా చెప్పుకొచ్చింది టబు. అజయ్‌దేవ్‌గణ్ గొప్ప స్నేహితుడని, అతనితో కలసి నటించడాన్ని ఎప్పుడూ ఇష్టపడతానని చెప్పింది.