నాగపూర్ లో భారీ వర్షాలు

మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో చాలా కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇక రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. భారీ వర్షాల ముప్పుపై ముందుగానే హెచ్చరించడంతో…. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.