దేశమంతా క్రికెట్ ఫీవర్

దేశమంతా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది. మధ్యాహ్నం మూడు గంటలు ఎప్పుడవుతుందా అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో అయితే టీమిండియా గెలవాలని అభిమానులు యాగం నిర్వహించారు. భారత జట్టు గెలుపు కోసం పూజలు చేశారు. దాయాది పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధిస్తుందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.