దుమ్మురేపిన మనమ్మాయిలు

ఐసిసి మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్ వరుసగా రెండో మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. టాంటన్ లో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐసిసి వరల్డ్ కప్ లో ఇది  ఏడో మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. చేజింగ్ కు దిగిన భారత మహిళల జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఇంకా 7.3 ఓవర్లు ఉండగానే 186 పరుగులు చేసింది. స్మృతి మందన 106 రన్స్ తో నాటౌట్ గా నిలవగా, కెప్టెన్ మిథాలీరాజ్  46 పరుగులు చేసింది.