దుండగుడి కాల్పుల్లో 34 మంది మృతి   

ఫిలిప్పీన్స్‌లో ఆగంతకుడు రెచ్చిపోయాడు. మనీలాలో ఓ రిసార్ట్‌ లోకి చొరబడ్డ  దుండగుడు.. టూరిస్టులపై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా టేబుళ్లకు నిప్పంటించాడు. దాంతో ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి.  ఊపిరి ఆడక 34 మంది అక్కడికక్కడే చనిపోగా..  25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మరికొంత మంది రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకడంతో  పలువుకి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడ్డది తామేనని ఐసిస్‌ ప్రకటించింది. అటు మనీలా పోలీసులు మాత్రం ఇది ఉగ్రదాడి కాదని చెప్తున్నారు.