దీపక్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిన టీడీపీ

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని టీడీపీ సస్పెండ్‌ చేసింది. హైదరాబాద్‌లో భూ కుంభకోణం ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన అనంతపురం ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు టీడీపీ సమన్వయ కమిటీ తెలిపింది. హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన భూములను దీపక్‌రెడ్డి కబ్జాచేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.