దీక్ష విరమించిన మధ్యప్రదేశ్ సీఎం

రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకూ దీక్ష చేస్తానని ప్రకటించిన మధ్యప్రదేశ్  సీఎం శివరాజ్  సింగ్ చౌహాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  రెండో రోజుకే దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల నేతలు, మంత్రులు చౌహాన్‌ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. నిరాహార దీక్ష చెయ్యొద్దని రైతులు కోరినందువల్లనే తాను దీక్షను ఆపేసినట్లు చెప్పారు సీఎం చౌహాన్.

రుణమాఫీ చేయాలని పోరాటం చేస్తున్న రైతులపై మండ్ సోర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయ్యింది. ఇంకా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో, భార్య సాధనతో కలిసి భోపాల్ లోని దసరా మైదానంలో నిన్న ఉదయం 11 గంటలకు ఆయన దీక్ష ప్రారంభించారు. అక్కడే రైతుల సమస్యలు వింటానని ప్రకటించారు.