దిగ్విజయ్ పై మంత్రి తలసాని పరువు నష్టం దావా

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మియాపూర్‌ భూముల వ్యవహారంలో తన ప్రమేయం ఉందన్న దిగ్విజయ్‌ అందుకు ఆధారాలు చూపాలని సవాల్‌ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు తలసాని చెప్పారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మరోవైపు, దిగ్విజయ్ సింగ్ పైన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ లో మంత్రి తలసాని ఫిర్యాదు చేశారు. మంత్రి తరఫున ఫిర్యాదును కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు.