దాణా కేసులో కోర్టు ముందుకు లాలూ, జగన్నాథ్‌

దాణా కుంభకోణంలో ఇద్దరు బీహార్ మాజీ సీఎంలు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్‌ మిశ్రాలు రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు వచ్చారు. కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు.. వీరిద్దరూ కోర్టుకు చేరుకున్నారు.  అయితే ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని లాలూ ఆశాభావం వ్యక్తం చేశారు.