త్వరలోనే టెట్, టీచర్ పోస్టుల భర్తీ

అతి త్వరలోనే టెట్ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్  ఉన్నారని చెప్పారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడమే బడిబాట ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. టీచర్లను నియమించే లోగా విద్యార్థులు నష్టపోకూడదని రాష్ట్రంలో 11 వేల మంది విద్యా వాలంటీర్లను నియమించామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గోండి మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరితో పాటు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌ రావు, జడ్పీ చైర్ పర్సన్ పద్మ  పాల్గొన్నారు.