తెలుగు సాహిత్యంలో మహోన్నత కీర్తి శిఖరం సినారె

తెలుగు సాహిత్యంలో మహోన్నత కీర్తి శిఖరం సినారె అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. సాహిత్య రంగానికి తీరని లోటు అని చెప్పారు. చివరి శ్వాస వరకూ సాహిత్యం కోసమే పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సినారె భౌతిక కాయానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి నివాళులు అర్పించారు. సినారె అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు కేటీఆర్ తెలిపారు.