తెలుగు షట్లర్లకు గవర్నర్ సన్మానం

యువక్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడం గర్వకారణమన్నారు గవర్నర్‌ నరసింహన్‌. కోచ్ గోపీచంద్ మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఇటీవల అంతర్జాతీయ టైటిల్స్ గెలిచిన యువ షట్లర్స్ శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, ప్రణయ్‌ ను గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. హైదరాబాద్ రాజ్‌ భవన్ లో జరిగిన అభినందన సభలో.. గవర్నర్ నరసింహన్‌ దంపతులతోపాటు కోచ్ పుల్లెల గోపిచంద్‌, క్రీడాకారులు శ్రీకాంత్‌, సాయి ప్రణీత్, ప్రణయ్ పాల్గొన్నారు.