తెలంగాణ సాధనలో పాల్వాయి పాత్ర మరువలేనిది

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. పాల్వాయి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాధనలో పాల్వాయి పాత్ర మరువలేనిదన్నారు. పాల్వాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన్నారు. అటు పాల్వాయి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి మరణవార్త తెలియగానే ఉత్తమ్‌కుమార్ బంజారాహిల్స్‌లోని పాల్వాయి నివాసానికి బయలుదేరారు. పాల్వాయి నాలుగు తరాల నాయకుడని..ఆయన మరణం కాంగ్రెస్‌కు, తెలంగాణకు తీరని లోటని ఉత్తమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.