తెలంగాణ చిత్రకళాప్రదర్శన ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. మంత్రి చందూలాల్ తో కలిసి చిత్ర ప్రదర్శనను చూశారు. 200 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు.

చిత్రకళ సృజనాత్మకతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ అన్నారు. చిత్రకళ ఎంతో విలువైనదని, ఇలాంటి కళలను ప్రోత్సహించేందుకు మనం కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం 200 మంది చిత్రకారులు ఆర్ట్ క్యాంపులో పాల్గొన్నారని, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావాలని ఆకాంక్షించారు.