తలసానిని కలిసిన సినీ ప్రతినిధులు

సచివాలయంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సినీ పరిశ్రమ ప్రతినిధులు సురేష్ బాబు, సి. కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సినీరంగంపై జీఎస్టీ ప్రభావం గురించి మంత్రితో చర్చించారు. జీఎస్టీతో సినీ పరిశ్రమకు వచ్చే సమస్యలను ప్రతినిధులు మంత్రికి వివరించారు. జీఎస్టీ నేపథ్యంలో ప్రభుత్వం విధించే వినోదపు పన్ను తొలగించాలని మంత్రిని కోరినట్లు సినీ ప్రతినిధులు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రితో సాయంత్రం 4 గంటలకు మరోసారి చర్చలు జరపనున్నట్లు చెప్పారు.