తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరిలలో కొత్తగా ఏర్పాటు చేసిన మన కూరగాయల రిటైల్‌ ఔట్‌ లెట్‌లను మంత్రులు హరీశ్ రావు, మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. భండారి లేవుట్‌, కొంపల్లిలోని ఫామ్‌ మిడోస్‌ లో మన కూరగాయల ఔట్‌ లెట్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 43 ఔట్‌ లెట్‌లు ప్రారంభించామని, త్వరలోనే వంద ఔట్‌ లెట్‌లను ప్రారంభిస్తామన్నారు. మన కూరగాయల ఔట్‌ లెట్‌ లో తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయని చెప్పారు. వీటికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు.