ఢిల్లీలో జీఎస్‌టీ మండలి సమావేశం

ఇవాళ ఢిల్లీలో జీఎస్‌టీ మండలి 15వ సమావేశం జరుగనున్నది. దీనికి మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. సామాన్యులపై భారం పడకుండా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను తగ్గించాలని మండలిలో ఈటల కోరనున్నారు.   గ్రానైట్‌ పై 28 శాతం పన్నును 12 లేదా 5 శాతం శ్లాబ్‌ రేట్ కిందకు చేర్చాలని ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై 12 శాతం పన్నురేటును 5 శాతానికి తగ్గించాలని, హోటళ్లపై కూడా 28 శాతం పన్నుభారం వేయకుండా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనున్నది. సామాన్యులపై భారం లేకుండా పన్ను విధానాన్ని సవరించడానికి అవసరమైతే జీఎస్‌టీ అమలు వాయిదాను కోరతామని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ పన్నురేట్లను నిర్ణయించేందుకు మండలి సమావేశమవుతున్నది. బంగారంతదితర సరుకులు, సేవలపై పన్ను శ్లాబులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.