ఢిల్లీకి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీ చేరుకున్నారు. పలువురు బీజేపీ ఎంపీలు, నేతలు ఆయన ఢిల్లీ ఏయిర్ పోర్టులో స్వాగతం పలికారు. రేపు(మంగళవారం) సాయంత్రం ఐదు గంటలకు రామ్ నాథ్ కోవింద్.. ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. మరోవైపు బీహార్ గవర్నర్ పదవికి కూడా కోవింద్ త్వరలోనే రాజీనామా చేసే అవకాశముంది.ఈ నెల 23న ఆయన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశముంది.