ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ

మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్నారు.  ఎయిర్  పోర్టులో మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్వాగతం పలికారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా తొలి రోజు పోర్చుగల్ లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని కోస్టాతో కలిసి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి జూన్‌  25న   వాషింగ్టన్  చేరుకున్న మోడీ.. రెండ్రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. తొలిరోజు టాప్‌  ట్వంటీ అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై.. భారత్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. ఆ తర్వాత వర్జినియాలో ఎన్నారైలతో భేటీ అయ్యారు. జూన్‌  26న ప్రెసిడెంట్‌  ట్రంప్‌ తో సమావేశమైన ప్రధాని.. దాదాపు 4 గంటల పాటు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిన్న నెదర్లాండ్‌ లో పర్యటించారు.