డీజే ఆడియో రిలీజ్

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డీజే – దువ్వాడ జగన్నాథమ్. హరీష్‌శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి వస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్ర గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని అల్లు అర్జున్ తనయుడు అయాన్, దిల్ రాజు మనువడు అరాన్ష్ విడుదల చేశారు. ఆడియో సీడీని అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలి ప్రతిని దర్శకుడు హరీష్‌శంకర్ స్వీకరించారు.