గూర్ఖా ఆందోళన మరింత ఉధృతం

డార్జిలింగ్ లో గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.  వరుసగా 12వ రోజు కూడా డార్జిలింగ్ లో బంద్ పాటిస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలు..రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒకవైపు డార్జిలింగ్ లో ఆందోళనలు మిన్నంటుతుంటే…మమతా బెనర్జీ నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లారు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి.