డార్జిలింగ్ బంద్ తో టూరిస్టుల అవస్థలు

గూర్ఖా జనముక్తి మోర్చా ఇచ్చిన బంద్‌ పిలుపుతో బెంగాల్ లోని డార్జిలింగ్‌ లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కొండ ప్రాంతంలో ఉన్న హోటళ్లు, మార్కెట్లు, దుకాణాలు కూడా మూతపడ్డాయి. దాంతో వేసవి విడిది కోసం వచ్చిన వేలాది మంది టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు కూడా తిరగడం లేదు. దాదాపు పర్యాటకం మీదనే ఆధారపడ్డ డార్జిలింగ్ ప్రాంతంలో బంద్ వల్ల అక్కడి వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.

జీజేఎం బంద్  పిలుపుపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బంద్ చట్టవ్యతిరేకమని, బంద్‌లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.