డార్జిలింగ్‌లో నాలుగో రోజూ ఉద్రిక్త  

బెంగాల్‌లోని డార్జిలింగ్ లో నాలుగో రోజు కూడా ఉద్రిక్త వాతారణం కొనసాగుతోంది.  గోర్ఖా జన ముక్తి మోర్చా చేస్తున్న ఆందోళనలు కట్టడి చేసేందుకు భారీగా బలగాలను దించింది ప్రభుత్వం.  గోర్ఖా జనముక్తి మోర్చా నేత విమల్ గురుంగ్ ఆఫీస్  తాళాలు పగుల గొట్టి.. సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున బాణాలు, ఆయుధాలు లభించాయి. వందల సంఖ్యలో బాణాలు, బాకులు, కొడవళ్లు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే తమ ఆఫీస్ పై దాడికి నిరసనగా.. జీజేఎం బంద్ కు పిలుపునిచ్చింది.